- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sai Dharam Tej: ‘అమ్మైనా నాన్నైన నువ్వే’ అమ్మ’.. అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన మెగా హీరో
హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి మేనల్లుడుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. తను వై.వి.ఎస్. చౌదరి రేయ్ చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి.. పిల్లా నువ్వులేని జీవితం చిత్రంతో ఫేమ్ దక్కించుకున్నాడు.
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటిలిజెంట్, తేజ్ ఐ లవ్ యు, ప్రతిరోజూ పండగే, చిత్ర లహరి, సోలో బ్రతుకే సో బెటర్, రిపబ్లిక్, విరూపాక్ష వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందాడు. అయితే నేడు ఫాదర్స్ డే సందర్భంగా సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికన ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘పిల్లలంటే మనసులో ఉన్న ఆనందం (పాఠశాల పుస్తకాలు, బొమ్మలు మరియు చాక్లెట్ల గురించి ) తన పిల్లల కోసం గెలవడానికి ఆటలను నిర్వహించే తండ్రి ప్రమాదాలు.
మనం వృద్ధులమవుతున్న నా తోటి సోదరులు, సోదరీమణులందరికీ మా తల్లిదండ్రులకు కూడా దానిని మర్చిపోవద్దు. తండ్రులకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు. తండ్రులు కాబోయే వారందరికీ అభినందనలు. నా ప్రియమైన అమ్మ నీకు కూడా .. అమ్మైన నన్నైన నువ్వే ముందు నాకు.. ఫాదర్స్ డే శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చాడు.






