Niharika : వాడు నా టెడ్డీ బేర్ అంటూ అతనితో ఉన్న రిలేషన్‌పై మెగా డాటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-03-09 16:02:57  IST  )

మెగా డాటర్ నిహారిక(Niharika Konidela ) యాంకర్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో నటిగా మారింది.

Niharika : వాడు నా టెడ్డీ బేర్ అంటూ అతనితో ఉన్న రిలేషన్‌పై మెగా డాటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక(Niharika Konidela ) యాంకర్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో నటిగా మారింది. అంతేకాకుండా హీరోయిన్‌గానూ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఆమె తండ్రి నాగబాబు, జొన్నలగడ్డ చైతన్య(Jonnalagadda Chaitanya)కు ఇచ్చి వివాహం జరిపించారు. 2020 డిసెంబర్‌లో వీరిద్దరు పెళ్లి ఘనంగా జరిగింది. ఆ తర్వాత కొద్ది కాలంగా వీరి కాపురం సాఫీగానే సాగింది. ఏమైందో తెలియదు కానీ నిహారిక, చైతన్య మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు. వ్యక్తిగత జీవితంలో బాగా డిస్ట్రబ్ అయిన నిహారిక కొన్నాళ్లు సైలెంట్‌గానే ఉన్న ఆమె తిరిగి మళ్లీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది.

నిర్మాతగా ఎంట్రీ ఇచ్చి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌ను స్థాపించి పలు చిత్రాలు తెరకెక్కించింది. ఇక గత ఏడాది నిహారిక నిర్మాతగా వ్యవహరించిన ‘కమిటీ కుర్రోళ్లు’ బాక్సాఫీసు వద్ద సంచలనం విషయం అందుకోవడంతో పాటు బాక్సాఫీసు వద్ద రాణించింది. ప్రస్తుతం హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటిస్తోంది. ఈ క్రమంలోనే.. నిహారికకు సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె తన అత్త కొడుకు సాయిధరమ్ తేజ్‌ను పెళ్లి చేసుకోబోతుందనే ప్రచారం వెలుగులోకి వచ్చింది. ఇక ఈ విషయంపై స్పందించిన ఆమె స్ట్రాంగ్‌గా వార్నింగ్ కూడా ఇచ్చింది.

ఇక ఆ తర్వాత మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్‌తో డిన్నర్‌కు వెళ్లిన ఫొటోలు బయటకు రావడంతో ఇక వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక కీలక వ్యాఖ్యలు చేసింది.కుర్రాళ్లందరీలో క్రేజీ ఎవరు అని యాంకర్ ప్రశ్నించగా.. బన్నీ అని చెబుతుంది నిహారిక. ఆయన హైపర్ యాక్టివ్ అని, ఎనర్జీ వేరే లెవల్ అని తెలిపింది. ఇక ఎవరినీ బుట్టలో పడేయడం ఈజీ అని యాంకర్ అడగ్గా.. వైష్ణవ్ తేజ్ ఏం చెప్పినా నమ్మేస్తాడు, నాకు వాడు టెడ్డీ బేర్ లాంటోడు’’ చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు తన రిలేషన్ క్లారిటీ ఇచ్చేసిందని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.

READ MORE ...

చీరలో వయ్యారాలు వలకబోస్తున్న యాంకరమ్మ.. సౌత్ ఇండియన్ క్వీన్ అంటూ కామెంట్స్


Next Story