బేబీ బంప్‌ మీద చేయి వేసి మరీ ఫొటోలు దిగిన మెగా కోడలు.. ప్రెగ్నెన్సీ గ్లో వచ్చేసిందంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్

by I. Sairam |

సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

బేబీ బంప్‌ మీద చేయి వేసి మరీ ఫొటోలు దిగిన మెగా కోడలు.. ప్రెగ్నెన్సీ గ్లో వచ్చేసిందంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ‘అందాల రాక్షసి’(andala Rakshasi) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో ఫుల్ మార్కులే కొట్టేసింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej)తో పీకల్లోతు ప్రేమలో పడ్డది ఈ అమ్మడు. అలా కొన్నాళ్లు సీక్రెట్‌గా లవ్ చేసుకున్న ఈ జంట గతేడాది పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక మ్యారేజ్ తర్వాత భర్తతో వేకెషన్స్‌కి వెళుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది.

ప్రస్తుతం ఈ చిన్నది ‘సతీ లీలావతి’(Sathi Leelavathi) అనే మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహన్(Dev Mohan) హీరోగా నటిస్తుండగా.. దుర్గాదేవి పిక్చర్స్‌, ట్రియో స్టూడియోస్ ప‌తాకాల‌ సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడ‌క్షన్ నెం.1 చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాకి తాతినేని స‌త్య(Tatineni Sathya) దర్శకత్వం వహిస్తుండగా.. నాగమోహ‌న్ బాబు.ఎమ్‌(M. Mohanbabu), రాజేష్‌.టి(T. Rajesh) నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. లావణ్య త్వరలో తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారాయి. మెగా కోడలు లావణ్య తన ఇన్‌స్టాలో యల్లో కలర్ పంజాబీ డ్రెస్సులో క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది. అలాగే సొట్టబుగ్గలతో చాలా అందంగా నవ్వుతూ కనిపించింది. మరికొన్ని పిక్స్‌లో బేబీ బంప్‌పై చేయి వేసి మరీ ఫొటోస్ దిగింది. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. ప్రెగ్నెన్సీ గ్లో వచ్చేసిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Link

Next Story