- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎట్టకేలకు గుడ్ న్యూస్ ప్రకటించిన మెగా కోడలు.. ఫుల్ హ్యాపీలో ఫ్యాన్స్
సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ‘అందాల రాక్షసి’(andala Rakshasi) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో ఫుల్ మార్కులే కొట్టేసింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej)తో పీకల్లోతు ప్రేమలో పడ్డది ఈ అమ్మడు. అలా కొన్నాళ్లు సీక్రెట్‌గా లవ్ చేసుకున్న ఈ జంట గతేడాది పెళ్లి కూడా చేసుకున్నారు.
ఇక మ్యారేజ్ తర్వాత భర్తతో వేకెషన్స్‌కి వెళుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అయితే పెళ్లి తర్వాత ఈ బ్యూటీ ‘మిస్ పర్‌ఫెక్ట్’(Miss Perfect) అనే వెబ్ సిరీస్‌లో నటించింది. మళ్లీ మరో సినిమా ప్రకటించలేదు. అయితే రీసెంట్‌గా లావణ్య పుట్టిన రోజు సందర్భంగా ‘సతీ లీలావతి’(Sathi Leelavathi) అనే మూవీలో నటించబోతున్నట్లు తెలిపింది. ఇక అప్పటి నుంచి లావణ్య మూవీ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతదా అని ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్‌ను తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది లావణ్య. ఇందులో భాగంగా సతీ లీలావతి సినిమా ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయిందని, ఇది నాకు చాలా సంతోషంగా ఉందని ఆమె తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. అంతేకాకుండా ఓ స్పెషల్ ఫొటోను కూడా షేర్ చేసుకుంది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారగా..ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీలో ఉన్నారు.
కాగా లావణ్య త్రిపాఠి, మలయాళ నటుడు దేవ్ మోహన్(Dev Mohan) ప్రధాన పాత్రల్లో దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకాల సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్ నెం.1 చిత్రంగా ‘సతీ లీలావతి’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి తాతినేని సత్య(Tatineni Sathya) దర్శకత్వం వహిస్తుండగా.. నాగమోహన్ బాబు.ఎమ్(M. Mohanbabu), రాజేష్.టి(T. Rajesh) నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ మూవీ సమ్మర్‌లో రానున్నట్లు సమాచారం.






