- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Niharika: ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన మెగా డాటర్.. నా కల నిజమైందంటూ ఆసక్తికర పోస్ట్

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక(Niharika) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె మొదట యాంకర్‌గా పరిచయం అయి ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత నాగబాబు కూతురిగా ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటించి ఫస్ట్ మూవీ ‘ఒక మనసు’(Oka Manasu). ఈ సినిమా హిట్ అందుకోకపోవడంతో పెద్దగా ఫేమ్ తెచ్చుకోలేకపోయింది. ఇక యాంకర్‌గా బుల్లితెరపై కొనసాగుతున్న క్రమంలోనే ఈ అమ్మడు జొన్నలగడ్డ చైతన్య(Jonnalagadda Chaitanya)ను పెళ్లి చేసుకుంది. అయితే వీరి కాపురం మున్నాళ్ల ముచ్చటగానే మారిపోయింది. కొద్ది రోజులకే వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత నుంచి నిహారిక నిర్మాతగా మారి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై సినిమాలు, వెబ్‌సిరీస్‌లు నిర్మిస్తోంది.
ఆమె నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’(Committee Kurrollu) బ్లాక్ బస్టర్ హిట్ సాధించండంతో నిహారికకు ఫుల్ పాపులారిటీ వచ్చింది. దీంతో ఆమె తమిళంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల ‘మద్రాస్‌కారణ్’(Madraskaaran)లో నటించి మెప్పించింది. మరీ బోల్డ్‌గా నటించినప్పటికీ సూపర్ హిట్‌ను సాధించలేకపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు కాస్త గ్యాప్ తీసుకుంది. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ ఏదో ఒక పోస్టు పెడుతూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, నిహారిక ఓ గుడ్ న్యూస్ ప్రకటించింది. ఈ మేరకు ఇన్‌స్టాలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ‘‘ఓహ్ గాడ్.. నేను అనుకున్నది జరిగింది. ఇది ఖచ్చితంగా నా లైఫ్‌లో, నా నటన జీవితంలో ప్రసిద్ధమైన రోజులలో ఒకటిగా మారిపోయింది. చాలా మందికి ఏదో ఒక కల ఉంటుంది. అలా నాకూడా ఉన్న కల ఒకటి నిజమైంది. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
కానీ నన్ను మాత్రం ఎలాంటి ప్రశ్నలు అడగకండి. ప్రస్తుతం నాకు గాలిలో తేలిపోతున్నట్లుగా ఎంతో సంతోషంగా ఉంది’’ అని రాసుకొచ్చింది. కానీ అసలు విషయాన్ని మాత్రం సస్పెన్స్‌లో పెట్టింది. ప్రస్తుతం నిహారిక పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక అది చూసిన నెటిజన్లు కొందరు.. ఆ గుడ్ ఏంటో? ఆమె దేని గురించి చెప్పిందో అర్థం కాక తల పట్టుకుంటున్నారు. మరికొందరు మాత్రం నచ్చిన వాడిని రెండో పెళ్లి చేసుకుంటుంది కావచ్చని? అంటున్నారు. అయితే యాక్టింగ్ కెరీర్‌కు సంబంధించింది అన్నది కాబట్టి స్టార్ హీరో సినిమాలో చాన్స్ వచ్చింది కావచ్చని అంచనా వేస్తున్నారు. ఇక మెగా అభిమానులు మాత్రం ఆమె చెప్పేవరకు వెయిట్ చేయండి కానీ పుకార్లు ప్రచారం చేయొద్దు అని అంటున్నారు.