Mega Brother Nagababu: వరుణ్ తేజ్ కరెక్ట్.. నిహారిక రాంగ్.. ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్టోన్న నాగబాబు కామెంట్స్

by Chukka Sudharani |

మెగా డాటర్ నిహారిక (Niharika) ప్రస్తుతం నిర్మాతగా మారి సక్సెస్‌ఫుల్ లైఫ్‌ను లీడ్ చేస్తుంది.

Mega Brother Nagababu: వరుణ్ తేజ్ కరెక్ట్.. నిహారిక రాంగ్.. ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్టోన్న నాగబాబు కామెంట్స్
X

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక (Niharika) ప్రస్తుతం నిర్మాతగా మారి సక్సెస్‌ఫుల్ లైఫ్‌ను లీడ్ చేస్తుంది. టీవీ యాంకర్‌గా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన నిహారిక.. తన యాక్టింగ్ స్కిల్స్‌తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలు తీసింది. నటన పరంగా పర్వాలేదు అనిపించుకున్న ఈ మెగా డాటర్.. సినీ కెరీర్ స్టార్టింగ్‌లోనే జొన్నలగడ్డ చైతన్య(Jonnalagadda Chaitanya)ను రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో డిసెంబర్ 9, 2020లో వివాహం చేసుకుంది. అయితే.. వీరి పెళ్లి బంధం మూడనాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. వాళ్లు 2023లో విడిపోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేయడంతో మెగా ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహానికి గురయ్యారు.

ఇక అప్పటి నుంచి నిహారిక రెండో పెళ్లిపై ఎన్నో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వాటన్నిటిని పక్కన పెట్టి.. ప్రస్తుతం నిర్మాతగా మారిన నిహారిక సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా లైఫ్ లీడ్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. నిహారిక మ్యారేజ్ విషయంపై రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మెగా బ్రదర్, జనసేన సీనియర్ నాయకులు నాగబాబు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘నేను మా పిల్లల నిర్ణయానికి ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తాను. అది మంచిది అయినా చెడ్డది అయినా సరే.. వారి ఇష్టానికి నేను విలువ ఇస్తాను. అయితే.. వరుణ్ (Varun Tej) లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు.. వాడి జడ్జిమెంట్ కరెక్ట్ అయింది. నిహారికకు మేము చూసి పెళ్లి చేశాము. అది రాంగ్ అయింది.. ఎందుకంటే మేము వారిద్దరిని (నిహారిక, చైతన్య) ప్రొపర్‌గా జడ్జ్ చేయలేకపోయాము’ అని తెలిపారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన కామెంట్స్ వైరల్ అవుతూ.. ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తున్నాయి.

Twitter

Next Story