- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లవ్ సింబల్ చేతిలో పట్టుకుని దర్శనమిచ్చిన మెగా బ్యూటీ.. ప్రేమలో ఉన్నానని కన్ఫార్మ్ చేసిందా అంటూ కామెంట్స్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ మెహ్రీన్ ఫిర్జాదా(Mehrin Firzada) ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’(Krishna Gaadi Veera Prema Gadha) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే మంచి మార్కులు కొట్టేసింది.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ బ్యూటీ మెహ్రీన్ ఫిర్జాదా(Mehrin Firzada) ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’(Krishna Gaadi Veera Prema Gadha) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత ‘F2’, ‘F3’ సినిమాలతో మరింత క్రేజ్ తెచ్చుకుంది. అలాగే తన అందం అభినయంతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఇక కెరీర్ స్టార్టింగ్‌లోనే ఓ వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ కొన్నాళ్లకే బ్రేకప్ అయిపోయిందని వెల్లడించింది. అలా బ్రేకప్ అయిన తర్వాత మెగా మేనళ్లుడు సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej)తో ప్రేమలో ఉందని త్వరలో వీరు పెళ్లి కూడా చేసుకుంటారని అప్పట్లో ఫుల్ రూమర్స్ షికార్లు చేశాయి. అయితే ఈ వార్తలను ఈ జంట అవన్నీ నిజం కాదని కొట్టిపారేసింది. అయినప్పటికీ అప్పుడప్పుడు వీరి ప్రేమ గాసిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతునే ఉంటాయి.
ఇదిలా ఉంటే.. సినిమాలకు దూరమైన ఈ భామ సోషల్ మీడియా(Social Media)లో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ నిత్యం అందాల జాతరతో అదరహో అనిపిస్తుంది. అంతేకాకుండా తన వ్యక్తిగత జీవితం గురించి పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా మెహ్రీన్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో ఓ లిప్ స్టిక్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ ఫొటోస్‌కు స్టిల్స్ ఇచ్చింది.అలాగే హార్ట్ సింబల్‌ను చేతిలో పట్టుకుని.. ‘ఎర్రటి పెదవులు.. అన్ని పర్‌ఫెక్ట్‌గా ఉంచడానికి చూస్తుంది’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ప్రేమలో ఉన్నట్లు కన్ఫార్మ్ చేస్తున్నావా ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు.






