చాలా ఎక్జైటింగ్‌గా ఉందంటూ ప్రకటన విడుదల చేసిన మెగా బ్యూటీ..ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్

by Mallepaka Hamsa |

మళయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) ‘హలో’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయింది.

చాలా ఎక్జైటింగ్‌గా ఉందంటూ ప్రకటన విడుదల చేసిన మెగా బ్యూటీ..ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: మళయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) ‘హలో’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఆ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సరసన ‘చిత్రలహరి’ లో నటించి క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో అవకాశాలు రాకపోవడంతో మళ్ళీ మలయాళ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. అక్కడ వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ప్రస్తుతం కళ్యాణి ‘ఒడుం కుతిర చదుం కుతిర’ చిత్రంలో నటిస్తోంది. వెడ్డింగ్ థీమ్‌తో రాబోతున్న ఈ మూవీలో ఫాహద్ ఫాజిల్(Fahad Fazil) హీరోగా నటిస్తున్నారు. ఇటీవల ఫస్ట్ లుక్ కూడా విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, కళ్యాణి మరో చిత్రాన్ని ప్రకటించింది. మరోసారి సేమ్ బ్యానర్‌పై నటించబోతున్నట్లు ప్రకటించింది. అషిక్ ఉస్మాన్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ‘టోర్‌పెడో’(Torpedo) లో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు పోస్ట్ ద్వారా తెలిపింది. మోహలన్ ‘తుడరుమ్’తో హిట్ అందుకున్న తరుణ్ మూర్తి(Tarun Murthy) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఫాహద్ ఫాజిల్ హీరోగా నటిస్తుండగా.. నస్రీన్, అర్జున్ దాస్(Arjun Das), గణపతి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే నేడు షూటింగ్ ప్రారంభమైనట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ పోస్ట్‌ను షేర్ చేస్తూ చాలా పెద్ద ప్రాజెక్ట్..ఎక్జైటింగ్‌గా ఉందని చెప్పింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా..అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Next Story