- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
న్యూ బిగినింగ్స్ కోసం ఉత్సాహంగా ఉన్నానంటూ లవ్ సింబల్ జోడించి మెగా బ్యూటీ పోస్ట్.. పోస్ట్ వైరల్

దిశ, వెబ్‌డెస్క్: అతిలోక సుందరి తనయురాలు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈ భామ తెలుగులో కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) హీరోగా నటించిన ‘దేవర’(Devara) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తన ఫస్ట్ మూవీతోనే మంచి హిట్ సాధించింది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘పెద్ది’ మూవీలో నటిస్తుంది. రామ్ చరణ్(Ram Charan) హీరోగా ‘ఉప్పెన’(Uppena) ఫేమ్ బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.
ఇక ఈ చిత్రానికి ఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇందులో స్టార్ యాక్టర్ జగపతి బాబు(Jagapathi Babu), శివరాజ్ కుమార్(Shivaraj Kumar) అలియాస్ శివన్న, దివ్వేంద్(Devend) వంటి ప్రముఖులు కీ రోల్ ప్లే చేస్తున్నారు. అయితే ఈ సినిమాను భారీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్(Mythri Movie Makers Banner) పై నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే జాన్వీ.. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో క్యూట్ కుక్క పిల్లతో ఉన్న ఫొటోలు షేర్ చేస్తూ.. ‘కొత్త ఆరంభాల కోసం ఉత్సాహంగా ఉన్నాను’ అనే క్యాప్షన్ రాసుకొస్తూ లవ్ సింబల్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు హార్ట్ సింబల్ ఎమోజీలను జోడిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.