- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూలైలో చేసిన విషయాలు అంటూ మెగా బ్యూటీ పోస్ట్.. ఆకట్టుకుంటున్న ఫొటోలు
మెగాహీరో వరుణ్ తేజ్(Varun tej) నటించిన ‘కంచె’(Kanche) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal).. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

దిశ, వెబ్‌డెస్క్: మెగాహీరో వరుణ్ తేజ్(Varun tej) నటించిన ‘కంచె’(Kanche) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal).. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటిస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. తాజాగా ఈ భామ బాలకృష్ణ(Balakrishna) సరసన ‘డాకు మహారాజ్’(Daku Maharaj) సినిమాలో నటించింది. ప్రజెంట్ ఒకటి రెండు ప్రాజెక్టుల్లో నటిస్తోంది.
ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో విందును వడ్డిస్తున్నది ప్రగ్యా జైస్వాల్. అలా ప్రతి రోజు వెరైటీ డ్రెసెస్‌తో కుర్రకారును మెస్మరైజ్ చేస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ప్రగ్యా తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో జూలై నెలలో దిగిన కొన్ని క్యూట్ ఫొటోస్, ఫుడ్ ఐటెం ఫొటోస్‌ను షేర్ చేసింది. ఇక వీటికి ‘జూలై నెలలో చేసిన విషయాలు’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు గ్లామరస్ క్వీన్, సూపర్ ఫొటోస్ బ్యూటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






