ట్రెండీ అవుట్‌ఫిట్‌లో మెగా బ్యూటీ.. మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటున్నావు అంటూ కామెంట్స్

by Gugulothu.Kavitha |

టాలీవుడ్ యంగ్ బ్యూటీ మెహ్రీన్ ఫిర్జాదా(Mehrin Pirzada) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ట్రెండీ అవుట్‌ఫిట్‌లో మెగా బ్యూటీ.. మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటున్నావు అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ బ్యూటీ మెహ్రీన్ ఫిర్జాదా(Mehrin Pirzada) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’(Krishna Gaadi Veera Prema gadha) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత F2, F3 సినిమాలతో మరింత క్రేజ్ తెచ్చుకుంది. అలాగే తన అందం అభినయంతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఇక కెరీర్ స్టార్టింగ్‌లోనే ఓ వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ కొన్నాళ్లకే బ్రేకప్ అయిపోయిందని వెల్లడించింది. అయితే అప్పడు ఫుల్ బక్కచిక్కి పోయి కనిపించి అయ్యో పాపం అనిపించింది. ఇప్పుడిప్పుడే మళ్లీ మంచి గ్లామరస్‌గా తయారవుతుంది.

ఇదిలా ఉంటే.. సినిమాలకు దూరమైన ఈ భామ సోషల్ మీడియా(Social Media)లో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ నిత్యం అందాల జాతరతో అదరహో అనిపిస్తుంది. అంతేకాకుండా తన వ్యక్తిగత జీవితం గురించి పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా మెహ్రీన్ తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో బ్లూ కలర్ డ్రెస్సులో వయ్యారాలు ఒలకబోస్తూ కనిపించింది. తొడ పార్ట్ కనిపించేలా బోల్డ్ షో చేసింది. ఇక వాటికి ‘ఇంద్ర ప్రమోషన్స్’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు గ్లామర్ షో ఓకే కానీ మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story