- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అల్లు అర్జున్ సినిమాలో మెగా బ్యూటీ ఫిక్స్.. హైప్ పెంచుతున్న ట్వీట్.. హిట్ ఖాయం అంటున్న నెటిజన్లు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఇటీవల ‘పుష్ప-2’(Pushpa 2: The Rule) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఇటీవల ‘పుష్ప-2’(Pushpa 2: The Rule) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీసు రికార్డును తిరగరాసింది. ఇక ఈ సినిమా ఓటీటీలోనూ హవా చూపిస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అల్లు అర్జున్ వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆయన మాట మాంత్రికుడు దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ చేయనున్నట్లు సమాచారం. అలాగే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee), అల్లు అర్జున్ కాంబోలో కూడా ఓ సినిమా రానున్నట్లు గత కొద్ది రోజుల నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలో, తాజాగా.. అల్లు అర్జున్- అట్లీ మూవీలో హీరోయిన్ ఫిక్స్ అయినట్లు సోషల్ మీడియాలో ఓ ట్వీట్ వైరల్ అవుతూ హైప్ పెంచుతోంది. ఈ సినిమాలో ఐకాన్ స్టార్‌తో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janvi Kapoor) రొమాన్స్ చేయనున్నట్లు టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియినప్పటికీ ఈ విషయం తెలుసుకున్న వారంతా హిట్ ఖాయం అని అంటున్నారు. కాగా, జాన్వీ కపూర్ ‘దేవర’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ మూవీలో ఎన్టీఆర్ నటించగా.. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రస్తుతం జాన్వీ, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) సరసన ‘rc-16’ నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక జాన్వీ మాత్రం షూటింగ్ గ్యాప్ దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలు షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అలాగే టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు అందుకుంటూ తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.
Exciting news! #JanhviKapoor is in talks for the #AlluArjun - #Atlee project! 🎬✨ pic.twitter.com/6GZy6TLIaU
— Filmy Bowl (@FilmyBowl) February 17, 2025






