- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వచ్చేసిన ‘మీసాల పిల్ల’ ఫుల్ సాంగ్.. పాట అదిరిందే పిల్ల అంటూ కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘మన శంకర వరప్రసాద్ గారు’.

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘మన శంకర వరప్రసాద్ గారు’. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా.. నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. ఇటీవల ఇందులో నుంచి ‘మీసాల పిల్ల’ ప్రోమో రిలీజ్ చెయ్యగా.. సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. భీమ్స్ మ్యూజిక్, లెజెండ్రీ సింగర్ ఉదిత్ నారాయణ వాయిస్, భాస్కర భట్ల రవికుమార్ లిరిక్స్‌తో పాట అదిరిపోయింది. ఇందులో చిరంజీవి, నయనతార సీన్స్ క్యూట్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
చిరంజీవి నయనతారను టీజ్ చేస్తూ పాడుతున్న ఈ పాటలో.. ‘రాజీ పడదాం అంటే రావే మాజీ ఇల్లాల.. నువ్వు రోజూ పెట్టే నరకంలోకి మళ్లీ దూకాల’ అంటూ వచ్చే లిరిక్‌తో.. చిరు- నయన్ మాజీ భార్యా భర్తలు అనే కీలకమైన పాయింట్ లీక్ చేసేసాడు అనిల్ రావిపూడి. మొత్తంగా ఈ సాంగ్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుండగా.. మీసాల పిల్ల.. పాట అదిరిందే పిల్లా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. పక్కా ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా వచ్చేందుకు సిద్ధం అవుతున్నది. లింక్






