- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Meenakshi Chowdhury: నేనొక డెంటిస్ట్.. సినిమాల్లోకి ఎలా వచ్చానో నాకే తెలియదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన యంగ్ హీరోయిన్
ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్స్‌లో మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhury) ఒకరు.

దిశ, సినిమా: ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్స్‌లో మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhury) ఒకరు. గతేడాది వచ్చిన ‘లక్కీ భాస్కర్’ (Lucky Bhaskar), ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలతో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ.. ప్రజెంట్ వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. అలాగే ఈమధ్య కాలంలో సోషల్ మీడియా (Social media)లో కూడా యాక్టీవ్ అయినా మీనాక్షి తన అంద చందాలతో యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అంతే కాకుండా.. వరుస ఈవెంట్స్‌లో పాల్గొంటూ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన ఈ అమ్మడు.. తన సినీ కెరీర్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
మీ లైఫ్ గోల్ ఏంటీ అనే ప్రశ్నపై మీనాక్షి స్పందిస్తూ.. ‘ఇది చాలా ఇంట్రెస్టింగ్ (Interesting) అండ్ టఫ్ క్వశ్చన్ (Tough question). ఎందుకంటే నా లైఫ్ గురించి నాకు కూడా ఓ ఐడియా లేదు. నా లైఫ్ నిజంగా ఫుల్ ఆఫ్ సర్‌ప్రైజెస్ (Full of surprises). నేను ఒక డెంటిస్ట్‌ని.. అంటే నా లైఫ్ ఒక మెడికల్ ప్రొఫెషన్ (Medical profession) నుంచి యాక్టింగ్ ప్రొఫెషన్ (Acting profession)లోకి ఎలా మొదలైంది అనేది నాకు కూడా ఐడియా లేదు. కానీ, నేను ఒక విషయం మాత్రం చెప్పగలను. మనకు వచ్చే అవకాశం లేదా ప్రాబ్లెం ఏదైనా సరే దాని పట్ల కృతజ్ఞతతో ఉండాలి. మనం జీవించి ఉండాలంటే ఏదైనా మన మంచికే అని అనుకోవాలి. ఈ సింపుల్ పిలాసిపీని ఫాలో అయితే చాలు.. జీవితం మంచిగా ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది.






