- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Meenakshi Chowdhury: అదిరిపోయే క్యాప్షనిచ్చి ఆకట్టుకుంటోన్న పోస్ట్ పంచుకున్న మీనాక్షి చౌదరి..
టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఆమె 2018లో ఫెమినా మిస్ ఇండియాగా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి 2021లో విడుదలైన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో కథానాయికగా తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది.
తర్వాత ఈ హీరోయిన్.. ఖిలాడి, హిట్: ది సెకండ్ కేస్, కొలై హత్య, గుంటూరు కారం, సింగపూర్ సెలూన్, లక్కీ భాస్కర్, మట్కా, మెకానిక్ రాకీ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది.
ముఖ్యంగా మీనాక్షి చౌదరి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన నటించి అద్భుతమైన నటన కనబర్చింది. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషించింది. ఈ సినిమా సంక్రాంతి పండుగకు విడుదలై.. భారీ విజయం సాధించింది. ఇకపోతే ఈ హీరోయిన్ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ‘చీర జ్వరం అయ్యో’ అంటూ ఓ క్యాప్షన్ రాసుకొచ్చి చీరపై ఆకట్టుకునే ఫొటోలు పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెటిజన్లకు విపరీతంగా ఆకట్టుకుంటుంది.






