ఆ హీరోతో టాలీవుడ్‌ హీరోయిన్ ఎఫైర్‌...చివ‌ర‌కు ట్విస్ట్ !

by velandi.Saikiran |

మీనాక్షి టీం క్లారిటీ ఇచ్చింది. ఈ ఇద్దరు రిలేషన్ లో ఉన్నట్లు చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.. కానీ ఇందులో

ఆ హీరోతో టాలీవుడ్‌ హీరోయిన్ ఎఫైర్‌...చివ‌ర‌కు ట్విస్ట్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ( Meenakshi Chaudhary ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ రోజుల్లోనే పాపులర్ హీరోయిన్ గా మారిపోయింది. పెద్ద పెద్ద హీరోల‌ సరసన సినిమాలు చేస్తోంది ఈ అందాల తార మీనాక్షి చౌదరి. 2021 సంవత్సరంలో ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా ఖిలాడీ, హిట్ ది సెకండ్ కేస్ లాంటి సినిమాలతో బంపర్ హిట్ అందుకుంది.

ఇక ఆ తర్వాత గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాలతో ఇండస్ట్రీని దున్నేశారు మీనాక్షి చౌదరి. అయితే అలాంటి మీనాక్షి చౌదరి, హీరో అనుమోలు సుశాంత్ తో ప్రేమలో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి.

అయితే దీనిపై తాజాగా మీనాక్షి టీం క్లారిటీ ఇచ్చింది. ఈ ఇద్దరు రిలేషన్ లో ఉన్నట్లు చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.. కానీ ఇందులో వాస్తవం లేదని మీనాక్షి చౌదరి టీం స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మకండి అంటూ పేర్కొంది. ఏదైనా సమాచారం ఉంటే అధికారికంగా తామే ప్రకటిస్తామని వివరణ ఇచ్చింది టీం.

Next Story