- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జస్ట్ మిస్...సౌందర్యతో పాటే నేను వెళ్లేదాన్ని...మీనా సంచలనం !
నటి సౌందర్య హెలికాప్టర్ ప్రమాదం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు మీనా. సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో

దిశ, వెబ్ డెస్క్ : నటి సౌందర్య హెలికాప్టర్ ప్రమాదం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు మీనా. సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. సౌందర్య ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయినప్పటికీ ఆమె సినిమాలతో ప్రేక్షకులకు ఎప్పుడు గుర్తుండిపోతారు. సౌందర్య మరణంపై మొదటిసారిగా మీనా మాట్లాడారు. ఆ రోజు హెలికాప్టర్ లో సౌందర్యతో పాటు నేను కూడా ప్రయాణించాల్సి ఉందని నటి మీనా.... నటుడు జగపతిబాబుతో పాల్గొన్న షోలో వెల్లడించారు.
నన్ను కూడా అదే క్యాంపెయిన్ కు ఆహ్వానించారని మీనా అన్నారు. కానీ నేను షూటింగ్స్ లో బిజీగా ఉండడం వల్ల ఆ క్యాంపెయిన్ కు వెళ్లలేక పోయానని మీనా పేర్కొన్నారు. షూటింగ్లో ఉన్న సమయంలో సౌందర్య మరణ వార్త తెలిసి షాక్ అయ్యాను అంటూ మీనా సంచలన విషయాలను షేర్ చేసుకున్నారు. సౌందర్యతో తనకు చాలా మంచి అనుబంధం ఉందని ఇద్దరం మంచి స్నేహితులం అంటూ మీనా పేర్కొన్నారు.
సౌందర్యతో ఉన్న స్నేహం, అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నటి మీనా ఎమోషనల్ అయ్యారు. కాగా, సౌందర్య తన కెరీర్ లో ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. తన నటన, అందంతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది నటి సౌందర్య. హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య అకస్మాత్తుగా మరణించి తన అభిమానులకు, కుటుంబ సభ్యులకు తీరని బాధను మిగిల్చారు. సౌందర్య మరణాన్ని ఇప్పటికీ ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు జీర్ణించుకోలేక పోతారు.






