- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంగ్లీ పాటపై అసభ్యకర కామెంట్స్.. కేసు పెట్టడంతో దిగొచ్చిన మేడిపల్లి స్టార్
ఈ మధ్య ట్రోల్స్ పేరుతో సోషల్ మీడియాలో కొందరు రెచ్చిపోతున్నారు. అది ట్రోల్ కంటెంట్ అయినా కాకపోయినా లైకులు, షేర్ల కోసం ఆరాటపడుతూ ట్రోల్స్ పేరుతో భూతులు తిట్టడం, అసభ్యకర కామెంట్స్ చేయడం కామన్ గా మారింది.

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్య ట్రోల్స్ పేరుతో సోషల్ మీడియాలో కొందరు రెచ్చిపోతున్నారు. అది ట్రోల్ కంటెంట్ అయినా కాకపోయినా లైకులు, షేర్ల కోసం ఆరాటపడుతూ ట్రోల్స్ పేరుతో భూతులు తిట్టడం, అసభ్యకర కామెంట్స్ చేయడం కామన్ గా మారింది. తాజాగా అలాంటి పరిస్థితే ఫోక్ సింగర్ మంగ్లీకి వచ్చింది. మంగ్లీ బావిలోనే బల్లిపడితే అనే పాటను రీసెంట్ గా విడుదల చేయగా ప్రస్తుతం ఆ పాట ట్రెండింగ్ లో ఉంది. ఐదురోజుల్లోనే 8మిలియన్లకు పైగా వ్యూవ్స్ వచ్చాయి. అయితే ఈ పాటపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసే ఓ వ్యక్తి అసభ్యకర కామెంట్స్ చేశాడు. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీంతో మంగ్లీ ఎస్ ఆర్ నగర్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది.
తన పాటను కించపరుస్తూ అసభ్యకర కామెంట్స్ చేశాడని, పాటనే కాకుండా ఎస్టీ సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడాడని ఫిర్యాదులో పేర్కొంది. సింగర్ మంగ్లీ ఇచ్చిన ఫిర్యాదుతో కేవలం కొన్ని గంటల్లోనే నిందితుడు సోషల్ మీడియాలో రీల్స్ చేసే మేడిపల్లి స్టార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా మేడిపల్లి స్టార్ మళ్లీ ఇలా రిపీట్ చేయను అని మంగ్లీ క్షమించాలని వేడుకున్నాడు. తాను వీడియోను ట్రోల్ చేయలేదని పాట ట్రెండింగ్ లో ఉందని పాటకు వచ్చిన కామెంట్స్ పై ట్రోల్స్ చేశానని చెప్పాడు. దయచేసి తనను విడిచిపెట్టాలని కోరాడు. కాగా నిందితుడు గతంలోనూ సోషల్ మీడియాలో ఇలాంటి అసభ్యకర కామెంట్లే చేశాడు.






