- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జపాన్‌లో భారీ భూకంపం.. హీరో ప్రభాస్ అక్కడే ఉండటంతో అభిమానుల్లో ఆందోళన
జపాన్‌లోని టోక్యో నగరం(Tokyo City)లో సోమవారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది.

దిశ, వెబ్ డెస్క్: జపాన్‌లోని టోక్యో నగరం(Tokyo City)లో సోమవారం సాయంత్రం భారీ భూకంపం (huge earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.6 తీవ్రత నమోదవ్వగా.. జపాన్ ఈశాన్య తీరంలో మూడు మీటర్ల ఎత్తుతో సునామీ వచ్చే అవకాశం ఉన్నట్లు ఆ దేశ వాతావరణ సంస్థ పేర్కొంది. ఈ క్రమంలో బాహుబలి ది ఎపిక్ రిలీజ్ ప్రచారంలో భాగంగా హీరో ప్రభాస్ (Hero Prabhas) అక్కడికి వెళ్లారు. అయితే భారీ భూకంపం నేపథ్యంలో ప్రభాస్ అభిమానుల్లో (Prabhas fans) ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. ఆయన ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారని అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
ప్రభాస్ అభిమానుల ఆందోళనలపై డైరెక్టర్ మారుతి (Director Maruti) స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. హీరో ప్రభాస్ జపాన్ లో క్షేమంగానే ఉన్నారని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తాను కూడా హీరో ప్రభాస్‌తో మాట్లాడానని ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతి స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే మారుతి డైరెక్షన్ లో హీరో ప్రభాస్ నటించిన రాజా సాబ్ (Raja Saab) సినిమా ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రభాస్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.






