నన్ను కమిట్‌మెంట్ అడిగాడు.. స్టార్ హీరో ధనుష్‌పై ప్రముఖ నటి సంచలనం

by Sujitha Rachapalli |

స్టార్ హీరో ధనుష్‌పై సంచలన ఆరోపణలు చేసింది ప్రముఖ నటి మాన్యా ఆనంద్. వనతై పోల, సూర్యవంశం వంటి సీరియల్స్‌ ద్వారా ఫేమ్ పొందిన ఆమె.. ఇలాంటి అలిగేషన్స్ చేసింది. ధనుష్ వండర్‌బార్ ప్రొడక్షన్స్‌లో నటించే అవకాశమిస్తామని శ్రేయస్ అనే వ్యక్తి కాల్ చేశాడని ఓ ఇంటర్వ్యూలో

నన్ను కమిట్‌మెంట్ అడిగాడు.. స్టార్ హీరో ధనుష్‌పై ప్రముఖ నటి సంచలనం
X

దిశ, వెబ్ డెస్క్ : స్టార్ హీరో ధనుష్‌పై సంచలన ఆరోపణలు చేసింది ప్రముఖ నటి మాన్యా ఆనంద్. వనతై పోల, సూర్యవంశం వంటి సీరియల్స్‌ ద్వారా ఫేమ్ పొందిన ఆమె.. ఇలాంటి అలిగేషన్స్ చేసింది. ధనుష్ వండర్‌బార్ ప్రొడక్షన్స్‌లో నటించే అవకాశమిస్తామని శ్రేయస్ అనే వ్యక్తి కాల్ చేశాడని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అయితే ఈ అవకాశం దక్కించుకోవాలంటే కమిట్మెంట్ ఇవ్వాలని అడిగాడని.. ధనుష్ సార్ కోసమైనా ఒప్పుకోవా అంటూ కాస్టింగ్ కౌచ్ డిమాండ్ గురించి బయటపెట్టింది. స్క్రిప్ట్, వండర్‌బార్ ఆఫీస్ లొకేషన్ పంపించి మీటింగ్‌కు రావాలని ఒత్తిడి చేశాడని.. దీంతో అతన్ని బ్లాక్ చేశానని చెప్పింది.

అయితే ఈ అలిగేషన్స్‌పై క్లారిటీ ఇచ్చింది ధనుష్ టీమ్. ఎవరో కావాలనే ధనుష్ మేనేజ్ శ్రేయస్ శ్రీనివాసన్ పేరు, ఫొటో ఉపయోగించి అమ్మాయిలను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని.. ఇలాంటి ఫిర్యాదులు ఇంతకు ముందు కూడా వచ్చాయిని, పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశామని స్పష్టం చేశారు.

Next Story