- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’లో మరో యంగ్ హీరో.. క్లైమాక్స్ మొత్తం అతని చుట్టూనే
‘డేవిడ్ రెడ్డి’ చిత్రంలో మంచు మనోజ్‌తో పాటు మరో హీరో కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ ప్రస్తుతం ‘డేవిడ్ రెడ్డి’ చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ఆయన పుట్టినరోజు సందర్భంగా మే 20న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికర వార్త టాలీవుడ్ వర్గాల్లో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో మంచు మనోజ్‌తో పాటు మరో యువ హీరో కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. పాత్ర నిడివి తక్కువగానే ఉన్నప్పటికీ, కథలో అది ఎంతో ప్రాధాన్యత కలిగి ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు ఆ యువ హీరో పాత్ర చుట్టూనే తిరగనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
దీంతో ఆ పాత్రలో ఎవరు కనిపించబోతున్నారు అనే అంశంపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ‘డేవిడ్ రెడ్డి’ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సోలో హీరోగా మంచు మనోజ్‌కు హిట్ వచ్చి చాలా కాలం కావడంతో, ఈ సినిమాతో ఆయన మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వస్తారా అనే ఆసక్తి జనాల్లో కనిపిస్తోంది. హనుమా రెడ్డి యక్కంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మరియా ర్యాబోషప్క హీరోయిన్‌గా నటిస్తోంది. వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్లపై భరత్ మోతుకూరి, వెంకట్ రెడ్డి నల్లాగంగుల నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.






