- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాకింగ్..హీరోయిన్‌కు బలవంతంగా ముద్దు పెట్టిన అభిమాని !
ఓ లేడీ అభిమాని బలవంతంగా హీరోయిన్ మంజు వారియర్ కు ముద్దు పెట్టింది.

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలకు అభిమానులు చుక్కలు చూపిస్తున్నారు. పబ్లిక్ ప్లేసుల్లో సెలబ్రిటీలు కనిపిస్తే ఎగబడి సెల్ఫీలు దిగడం, మీద పడిపోవడం చేస్తున్నారు. ది రాజా సాబ్ సినిమా సందర్భంగా నిధి అగర్వాల్ ను అభిమానులు చాలా ఇబ్బంది పెట్టారు. అయితే అలాంటి సంఘటనే తాజాగా మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్ కు ( Manju Warrier) చోటు చేసుకుంది. కేరళలోని పాలక్కాడ్ లో ఈవెంట్ కు వెళ్లారు. ఈ సందర్భంగా అభిమానులందరూ హీరోయిన్ మంజు వారియర్ తో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు.
అయితే అందులో ఓ లేడీ అభిమాని బలవంతంగా హీరోయిన్ మంజు వారియర్ కు ముద్దు పెట్టింది. ఎవరూ ఊహించని విధంగా ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉలిక్కిపడ్డారు. ఇక అక్కడే ఉన్న ఈవెంట్ యాంకర్ వెంటనే రియాక్ట్ అయి, అభిమానులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మన దగ్గరకు వచ్చిన సెలబ్రిటీలతో ఇలా ప్రవర్తించడం ఏ మాత్రం సరి కాదని వెల్లడించింది. ఇంత తతంగం జరుగుతున్న కూడా మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్ సీరియస్ కాలేదు. చాలా కూల్ గా ఉంటూ ఎవరిని ఏమనలేదు. దీంతో ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది.






