మహేష్ కోసం మణిశర్మ చేసిన పనిని ఇండియాలో ఎవరూ చేసి ఉండరు.. సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్

by Pulgam srinivas |   (  Updated:2026-02-14 08:38:39  IST  )

సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ... కృష్ణవంశీ గారు పని రాక్షసుడు. సినిమా కోసం ఏ స్థాయికైనా వెళుతుంటారు. మహేష్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన మురారి సినిమాకు నేను పనిచేశాను. ఆ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు. సినిమా షూటింగ్ స్టార్ట్ కాకముందే ఆయన ఈ సినిమాకు సంబంధించిన అన్ని పాటలను రికార్డ్ చేసి ఇచ్చారు. బహుశా ఇండియన్ సినీ చరిత్రలోనే ఇది ఒక రికార్డు అనుకుంటా అని రామ్ ప్రసాద్ అన్నారు.

మహేష్ కోసం మణిశర్మ చేసిన పనిని ఇండియాలో ఎవరూ చేసి ఉండరు.. సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్
X

దిశ, వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా సంవత్సరాల క్రితం మురారి అనే మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. సోనాలి బింద్రే హీరోయిన్గా నటించిన ఈ మూవీకి కృష్ణవంశీ దర్శకత్వం వహించగా మణిశర్మ సంగీతం అందించాడు. 2001వ సంవత్సరం విడుదల అయిన ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం ద్వారా మహేష్‌కి మంచి గుర్తింపు వచ్చింది. రామ్ ప్రసాద్ ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించాడు. ఈయన ఈ సినిమాను చూపించిన విధానానికి గాను మంచి ప్రశంసలను అందుకున్నాడు.

తాజాగా రామ్ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ఈయన కృష్ణవంశీ మరియు మురారి చిత్రానికి సంబంధించిన అనేక విషయాలను తెలియజేశాడు. రామ్ ప్రసాద్ మాట్లాడుతూ... కృష్ణవంశీ గారితో నేను చాలా సినిమాలు చేశాను. ఆయన ఒక పని రాక్షసుడు. సినిమా తప్ప ఆయనకు వేరే విషయం తెలియదు. సినిమాను ఎంతో అద్భుతంగా తీయాలని ఆయన తపన పడుతూ ఉంటాడు. నక్షత్రం సినిమా సమయంలో ఓ సన్నివేశంలో హీరో తన సర్టిఫికెట్లను గాల్లోకి విసరాలి. ఆ సన్నివేశం కోసం ఓ అసిస్టెంట్ చాలాసార్లు పేపర్లు గాల్లోకి విసిరాడు, కానీ అసలు సరిగ్గా రావడం లేదు.

దానితో కృష్ణవంశీ స్వయంగా వెళ్లి మట్టిలో కూర్చొని ఆ పేపర్లను గాల్లోకి విసిరాడు. అలా ఆయన సినిమా కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు. ఇక మహేష్ బాబుతో మేము మురారి సినిమా చేశాం. ఆ మూవీ మంచి విజయం సాధించింది. ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ కాకముందే మణిశర్మ గారు ఆ మూవీకి సంబంధించిన అన్ని పాటలను రికార్డ్ చేసి ఇచ్చేశారు. బహుశా ఇండియన్ సినిమా చరిత్రలోనే సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ కాకముందే అన్ని సాంగ్స్ ఇవ్వడం ఇదే మొదటిసారి అనుకుంటా అని రామ్ ప్రసాద్ చెప్పుకొచ్చాడు.

2026లో ఆ ఇద్దరు హీరోల అభిమానులకు ఫుల్ డిసప్పాయింట్మెంట్..?

Next Story