2026లో ఆ ఇద్దరు హీరోల అభిమానులకు ఫుల్ డిసప్పాయింట్మెంట్..?

by Pulgam srinivas |   (  Updated:2026-02-14 04:47:54  IST  )

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఆఖరి సినిమాలు 2024లో విడుదలయ్యాయి. 2025, 2026లో కూడా వీరి చిత్రాలు విడుదల కావడం లేదు. మహేష్ నటిస్తున్న వారణాసి, అల్లు అర్జున్, అట్లీతో చేస్తున్న సినిమా 2027లో విడుదల కానున్నాయి.

2026లో ఆ ఇద్దరు హీరోల అభిమానులకు ఫుల్ డిసప్పాయింట్మెంట్..?
X

దిశ, వెబ్ డెస్క్ : చాలా సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే మన తెలుగు స్టార్ హీరోలు సంవత్సరానికి చాలా సులువుగా రెండు, మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేవారు. ఆ తర్వాత క్వాలిటీ, కంటెంట్ పేరుతో మూవీల సంఖ్య తగ్గుతూ వస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు కనీసం స్టార్ హీరోలు సంవత్సరానికి ఒక సినిమా అయినా విడుదల చేసేవారు. ప్రస్తుతం మాత్రం ఒక్కో స్టార్ హీరో రెండు, మూడేళ్లకు ఒక సినిమాతో ముందుకు వస్తున్నారు. హీరోల అభిమానులు సంవత్సరానికి ఒక సినిమా అయినా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తే బాగుంటుందని అభిప్రాయాలను వ్యక్తపరిచిన సందర్భాలు ఉన్నాయి.

ఈ సంవత్సరం ఇప్పటికే కొంతమంది స్టార్ హీరోలు నటించిన చిత్రాలు విడుదల అయ్యాయి. అలాగే మరికొన్ని విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ సంవత్సరం ఓ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు మాత్రం విడుదల కావడం లేదు. దానితో ఆ హీరోల అభిమానులు నిరాశకు గురవుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు 2024 సంక్రాంతి పండుగ సందర్భంగా గుంటూరు కారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత మహేష్, రాజమౌళి దర్శకత్వంలో వారణాసిని ప్రారంభించాడు.

ఆ షూటింగ్ ఇప్పటికే 50% వరకు పూర్తయినట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప పార్ట్ 2 2024వ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదలైంది. ఆ తర్వాత కొంతకాలం విరామం తీసుకున్న బన్నీ, అట్లీ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించాడు. ఆ చిత్రాన్ని వచ్చే సంవత్సరం విడుదల చేయనున్నారు. దానితో ఈ హీరో తర్వాతి సినిమాకి రెండు సంవత్సరాల విరామం రానుంది.

ఒకప్పుడు స్టార్ ద‌ర్శ‌కులు.. ఇప్పుడు అవ‌కాశాల కోసం ఎన్నో క‌ష్టాలు..?

Next Story