కొత్త సినిమాతో రాబోతున్న మంచు వారి అబ్బాయి.. టైటిల్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

by I. Sairam |

రాకింగ్ స్టార్ మంచు మనోజ్(Manchu Manoj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

కొత్త సినిమాతో రాబోతున్న మంచు వారి అబ్బాయి.. టైటిల్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
X

దిశ, వెబ్‌డెస్క్: రాకింగ్ స్టార్ మంచు మనోజ్(Manchu Manoj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ‘భైరవం’(Bhairavam) మూవీతో మనముందుకు వచ్చిన ఆయన ప్రజెంట్ యంగ్ హీరో తేజ సజ్జా(Teja Sajja) నటిస్తున్న ‘మిరాయ్’(Mirai) మూవీలో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అయితే తాజాగా ఆయన ఓ స్పెషల్ ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు. ఇక దీనికి హనుమ రెడ్డి(Hanuma Reddy) దర్శకత్వం వహిస్తుండగా..వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై మోతుకూరి భరత్, నల్లగంగుళ వెంకట్ రెడ్డి నిర్మిస్తున్నారు.

అయితే హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘డేవిడ్ రెడ్డి’(David Reddy) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కాగా ఈ సినిమా 1897–1922 మధ్య కాలాన్ని ఆధారంగా చేసుకున్న ఓ విప్లవ కథ. కుల వ్యవస్థ ఒత్తిడుల నుంచి తిరగబడి, బ్రిటిష్ పాలన పై ఎదురు తిరిగిన ఓ రెబల్ జీవితం చుట్టూ తిరుగుతుంది. మద్రాస్ ప్రెసిడెన్సీలో పుట్టి, ఢిల్లీలో పెరిగి, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కదిలించే పాత్రలో మనోజ్ కనిపించబోతున్నాడు.

Link

Next Story