మంచు విష్ణు తదుపరి చిత్రంపై ఇంట్రెస్టింగ్ న్యూస్.. ఆ స్టార్ డైరెక్టర్‌తో జతకట్టబోతున్న హీరో

by Chukka Sudharani |

డైనమిక్ హీరో మంచు విష్ణు రీసెంట్‌గా ‘కన్నప్ప’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

మంచు విష్ణు తదుపరి చిత్రంపై ఇంట్రెస్టింగ్ న్యూస్.. ఆ స్టార్ డైరెక్టర్‌తో జతకట్టబోతున్న హీరో
X

దిశ, సినిమా: డైనమిక్ హీరో మంచు విష్ణు రీసెంట్‌గా ‘కన్నప్ప’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మోహన్ బాబు నిర్మించగా.. దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ అద్భుతంగా తెరకెక్కించారు. న్యూజిలాండ్‌లోని అందమైన ప్రకృతి దృశ్యాలలో చిత్రీకరించబడిన ఈ చిత్రం విజువల్ వండర్‌గా నిలిచింది. దీంతో కన్నప్ప రిలీజ్ తర్వాత విష్ణు చేయబోయే ప్రాజెక్టులు, సినిమాలపై అందరి దృష్టి పడింది. ‘కన్నప్ప’లో అద్భుతమైన నటనను కనబర్చిన విష్ణుపై ప్రేక్షకుల్లో ఒక్కసారిగా ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోగా.. ఆయన తదుపరి చిత్రం ఏ డైరెక్టర్‌తో చేస్తాడు, ఎలాంటి జోనర్‌లో సినిమాలు చేస్తాడు అని అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

ఇందులో భాగంగానే తాజాగా విష్ణు తదుపరి మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట సందడి చేస్తుంది. నటుడు, డ్యాన్సర్, డైరెక్టర్ ప్రభుదేవా మళ్ళీ కొత్త చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారని టాక్. విష్ణు మంచు ఈ ప్రాజెక్ట్‌లో హీరోగా నటిస్తున్నట్లు తెలుస్తుంది. తెలుగులో రూపొందబోతున్న ఈ మూవీపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ప్రభుదేవా డైరెక్షన్‌లో విష్ణు సినిమానా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. లింక్


Next Story