- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీ అందరి ఆశీస్సులు కావాలంటూ సోషల్ మీడియాలో మంచు విష్ణు ఇంట్రెస్టింగ్ పోస్ట్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే
మంచు విష్ణు(ManchuVishnu) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘కన్నప్ప’(Kannappa).

దిశ, వెబ్‌డెస్క్: మంచు విష్ణు(ManchuVishnu) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘కన్నప్ప’(Kannappa). ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 27న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్స్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఈ సినిమాలో ప్రభాస్(Prabhas), అక్షయ్ కుమార్(Akshay Kumar), మోహన్ లాల్(Mohanlal), కాజల్(Kajal) లాంటి స్టార్స్ ఉండటంతో సగటు అభిమానులు కూడా కన్నప్ప సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే నిన్న ఈ మూవీ నుంచి వచ్చిన ‘శ్రీకాళహస్తి’ సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.
ఈ క్రమంలో మంచు విష్ణు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. అందులో.. ‘శ్రీకాళహస్తి చరిత్రపై పాట ఇదిగో. నా చిన్న ఆరి మరియు వివి ఈ పాట కోసం పాడారు మరియు ప్రదర్శించారు. వాయు లింగ కథను జీవం పోసినందుకు స్వరకర్త స్టీఫెన్ మరియు కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్‌కి నేను తగినంత కృతజ్ఞతలు చెప్పలేను. కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగ పవిత్ర మందిరంలో దీనిని ఆవిష్కరించారు.. మీ అందరి ఆశీస్సులు కావాలి. #హర్‌హర్‌మహాదేవ్ #కన్నప్ప’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీనిపై నెటిజన్లు సినిమా కూడా మంచి హిట్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు.






