- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏ హీరో చేయని పని చేసిన మంచు విష్ణు.. సోషల్ మీడియోలో వైరల్‌గా మారిన వీడియో.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!
గత కొద్ది రోజుల నుంచి ఎక్కడ చూసినా పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన పోస్టులే దర్శనమిస్తున్నాయి.

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి ఎక్కడ చూసినా పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన పోస్టులే దర్శనమిస్తున్నాయి. ఈ సంఘటన విషయంలో యావత్ భారతదేశం ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. పాకిస్తాన్‌పై ఎదురుదాడి చేసేందుకు కూడా వెనకాడటం లేదు. 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన వారిని వదలకూడదని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా వారి కుటుంబాలకు న్యాయం చేయాలని అంటున్నారు. ఈ క్రమంలోనే.. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మదుసూదన్‌రావు కుటుంబ సభ్యులను మంచు విష్ణు (Vishnu Manchu)పరామర్శించారు.
స్వయంగా వారి ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పారు. నెల్లురు జిల్లా కావలిలోని వారి ఇంటికి చేరుకున్న విష్ణు మధుసూదన్‌రావు(Madhusudhan Rao) చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్చించారు. అనంతరం దాడి గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ విషయంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. మధుసూదన్ రావు కుటుంబానికి ఎలాంటి భరోసా ఇచ్చాను అనేది మా పర్సనల్ విషయం దాని గురించి చెప్పాలనుకోవడం లేదు. దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి అని అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక అది చూసిన వారు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏ హరో చేయని పని చేశాడంటూ మెచ్చుకుంటున్నారు. కాగా, మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కన్నప్ప’(Kannappa). ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రాబోతుంది. దీనిని మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఇందులో ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్(Akshay Kumar), మోహన్ బాబు వంటి స్టార్స్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈసినిమా జూన్ 27 థియేటర్స్‌లోకి రానుంది.






