- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జర్నీ వీడియో షేర్ చేసిన మంచు విష్ణు.. నా కోరిక తిరుతుందన్న నమ్మకం ఉందంటూ ఆసక్తికర కామెంట్స్
టాలీవుడ్ హీరో మంచు విష్ణు(vishnumanchu)చాలా రోజుల తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో మంచు విష్ణు(vishnumanchu)చాలా రోజుల తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ముఖేష్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో స్టార్ హీరోలు అక్షయ్ కుమార్(Akshay Kumar), ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్, మధుబాల కూడా నటిస్తున్నారు. దీనిని అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ 27న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈనేపథ్యంలో.. మంచు విష్ణు ఓ 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలని కోరుకున్నారట. అయితే కేవలం 7 శివాలయాలకు మాత్రమే వెల్లాడట.
ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ ఓ వీడియోను షేర్ చేశారు. ‘‘నేను కన్నప్ప విడుదల కాకముందే 12 జ్యోతిర్లింగాల యాత్ర మొదలుపెట్టాను. కానీ ఇప్పటివరకు 7 చూశాను. మొన్నటికి మొన్న మహారాష్ట్రలో ఉన్న మూడు లింగాలను దర్శించుకున్నాను. అసలు నాకు ఎందుకు తిరగాలనిపించిందో తెలియదు. కానీ వెళ్లిన ప్రతిచోట నా జీవితంలో పాజివిటీనే ఉందన్న నమ్మకం కలిగింది. అత్యంత అద్భుతమైన అనుభూతి. నేను త్వరలోనే శివయ్య అనుగ్రహంతో 12 లింగాలను చూస్తానని నమ్మకంగా ఉన్నా.. నా కోరిక నెరవేరుతుంది’’ అని చెప్పుకొచ్చారు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు కొందరు అంతా మంచే జరుగుతుందని కామెంట్లు పెడుతుండగా.. మరికొందరు మాత్రం ని సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుందని అంటున్నారు.






