- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నా జీవితంలో ప్రభాస్ కృష్ణుడు.. తనకి నేను కర్ణుడ్ని’: మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు
కన్నప్ప(Kannappa Movie) ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో ప్రభాస్‌పై(Prabhas) నటుడు మంచు విష్ణు(Manchu Vishnu) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘స్నేహితులలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు.

దిశ, వెబ్‌డెస్క్: కన్నప్ప(Kannappa Movie) ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో ప్రభాస్‌పై(Prabhas) నటుడు మంచు విష్ణు(Manchu Vishnu) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘స్నేహితులలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు. అందులో ఒకరు కృష్ణుడి లాంటి వారు.. ఇంకొకరు కర్ణుడు లాంటి వారు.. మేము కూడా సేమ్ అలాగే.. నా జీవితంలో ప్రభాస్ కృష్ణుడు అయితే.. తనకి నేను అర్జునుడిని. ప్రభాస్ ఇప్పుడు ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే చాలా పెద్ద హీరో. అతను ఈ సినిమా చేయాల్సిన అవసరం లేదు. కానీ.. కేవలం నా తండ్రి మోహన్ బాబు మీదున్న ప్రేమ, అభిమానం, గౌరవంతోనే ఒప్పుకున్నాడు. ఈ విషయాన్ని నేను పదే పదే ప్రభాస్ ముందు కూడా చెప్పాను. నువ్వు నాకోసం కాదు.. మా నాన్న కోసమే ఈ సినిమా ఒప్పుకున్నావని రోజూ ఏడిపిస్తుంటాను. తను కూడా కాంప్రమైజ్ అవ్వకుండా.. నిజమే నీకోసం కాదు.. మా బావ మోహన్ బాబు కోసమే చేశాను అని చెబుతుంటాడు. ప్రభాస్ అభిమానులకు ఒక విషయం చెప్పాలి ప్రభాస్ చాలా పెద్ద మానవతావాది. డబ్బు వచ్చినా.. పేరు వచ్చినా కొందరిలో చాలా మార్పు చూస్తాం. కానీ ప్రభాస్‌లో అవేమీ కనిపించవు. చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి మన ఇండస్ట్రీలో ఉండటం మనందరికీ గర్వకారణం’ అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా, కన్నప్ప మూవీ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రీతి ముకుందన్, మోహన్ బాబు, శరత్ కుమార్, మధు, ముఖేష్ రిషితో పాటు మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు స్వయంగా మంచు విష్ణు కథ, స్క్రీన్‌ప్లే అందించారు. వీడియో






