- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కన్నప్ప’ సినిమా ప్రమోషన్స్ కోసం మంచు విష్ణు భారీ ప్లాన్.. అదిరిపోయిందంటున్న నెటిజన్లు
టాలీవుడ్ హీరో మంచు విష్ణు(Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న సినిమా ‘కన్నప్ప’(Kannappa).

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో మంచు విష్ణు(Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న సినిమా ‘కన్నప్ప’(Kannappa). ముఖేష్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వంలో రాబోతుంది. అయితే భారీ అంచనాల మధ్య ఈ చిత్రం జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో.. తాజాగా, ‘కన్నప్ప’ మూవీ ప్రమోషన్స్ కోసం మంచు విష్ణు మాస్టర్ ప్లాన్ చేస్తున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. గత కొన్నేళ్ల నుంచి తెలుగు సినిమాలకు అమెరికాలో మంచి ఆదరణ లభిస్తుండటంతో ‘కన్నప్ప’ టీమ్ కూడా అక్కడే దృష్టిపెట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన పలు ఈవెంట్లను డల్లాస్, లాస్ఏంజిల్స్, అమెరికా వంటి ప్రాంతాల్లో నిర్వహించబోతున్నట్లు సమాచారం. అయితే మే 8 నుంచి వరుసగా ‘కన్నప్ప’ టీమ్ ప్రచార కార్యక్రమాలను నిర్వహించబోతున్నారట. అంతేకాకుండా న్యూజెర్సీలో రోడ్‌షో వేదికగా, డల్లాస్, లాస్ ఏంజిల్స్‌లో ప్రధాన ఈవెంట్‌లు జరబోతున్నట్లు టాక్.
ఇక మే 15 వరకు ఈవెంట్లను పూర్తి చేసి ఇండియాకు వచ్చి ఇక్కడ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. మంచు విష్ణు దాదాపు నెలరోజులపాటు ఫుల్ బిజీ బిజీగా ఉండనున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు మాస్టర్ ప్లాన్ అదిరిపోయిందిహిట్ కొట్టడం ఖాయం అని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో మంచు విష్ణు, ప్రీతి ముకుందన్ జంటగా నటించారు. అలాగే ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్(Akshay Kumar),రఘుబాబు, బ్రాహ్మానందం, శరత్ కుమార్, మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని మోహన్ బాబు నిర్మిస్తున్నారు. దాదాపు 100కోట్లతో రాబోతున్న ‘కన్నప్ప’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లోకి రాబోతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






