- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Manchu Vishnu: శివుడే నాతో ఈ సినిమా చేపించాడు: మంచు విష్ణు
కన్నప్ప సినిమాను కన్నబిడ్డలా చూసుకున్నామని హీరో మంచు విష్ణు అన్నారు. ఎన్నో సంవత్సరాలు కన్నప్పను బిడ్డలాగా చూసుకున్నామని, ఇప్పుడు ప్రేక్షకుల ముందు పెడుతున్నామని చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: కన్నప్ప సినిమాను కన్నబిడ్డలా చూసుకున్నామని హీరో మంచు విష్ణు అన్నారు. ఎన్నో సంవత్సరాలు కన్నప్పను బిడ్డలాగా చూసుకున్నామని, ఇప్పుడు ప్రేక్షకుల ముందు పెడుతున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని ఆశిస్తున్నామన్నారు. కన్నప్ప సినిమా ఈవెంట్‌లో మంచు విష్ణు మాట్లాడారు. ఈ సినిమా జర్నీ వ్యక్తిగతంగా తనను ఎంతగానో మార్చేసిందని అన్నారు. దాదాపు 50 సంవత్సరాల తరవాత తెలుగులో మళ్లీ కన్నప్ప సినిమాను చిత్రీకరించామని చెప్పారు. 50 ఏళ్ల తరవాత ఈ తరానికి కన్నప్ప కథ మళ్లీ చెప్పరా అని తనను శివుడు ఎన్నుకున్నాడని అనిపిస్తుందన్నారు. అంతే కాకుండా ఈ చిత్రాన్ని ప్రభాస్ తాను చెప్పినందుకు ఒప్పుకోలేదని, తన తండ్రి మొహన్ బాబు అడగటంతో ఒప్పుకున్నాడని చెప్పారు. మోహన్ బాబు అడిగిన వెంటనే ఆయన పెద్దరికానికి గౌరవం ఇచ్చి ఒప్పుకున్నారని అన్నారు. ఆ తరవాతనే తనను చూసి ఒప్పుకున్నాడని తెలిపారు.






