కొత్త వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన మంచు వారమ్మాయి.. ఇది నా హృదయంలోని ఒక భాగం అంటూ పోస్ట్

by Gugulothu.Kavitha |

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu) కూతురు మంచు లక్ష్మి(Lakshmi) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

కొత్త వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన మంచు వారమ్మాయి.. ఇది నా హృదయంలోని ఒక భాగం అంటూ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu) కూతురు మంచు లక్ష్మి(Lakshmi) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఈ బ్యూటీ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ పెద్దగా ఫేమ్ తెచ్చుకోలేక పోయింది. కానీ నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌ను మాత్రం పెంచుకుంటుంది. అలా లేటెస్ట్ ఫొటో షూట్స్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో మంచు లక్ష్మి పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా మంచు వారమ్మాయి తన ఇన్‌స్టా(Instagram) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో కొత్తగా చీరల బిజినెస్ స్టార్ట్ చేసినట్లు తెలిపింది.

అలాగే దానికి హెరిటేజ్ వీవ్స్(Heritage Weaves) అనే నేమ్ కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ.. ‘నా హృదయం నుండి మీ హృదయం వరకు అపారమైన ఆనందం మరియు ప్రేమతో, నా కొత్త వెంచర్ - “హెరిటేజ్ వీవ్స్” ను మీకు అందిస్తున్నాను. ప్రతి చీరలో అల్లిన కాలాతీత సంప్రదాయాలు మరియు అవి మోసుకెళ్ళే కథలకు నివాళి. ఇది ఒక బ్రాండ్ కంటే ఎక్కువ, ఇది నా హృదయంలోని ఒక భాగం’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.ఇక దీన్ని చూసిన నెటిజన్లు కంగ్రాట్స్‌తో పాటు ఆల్ ది బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు.

Next Story