ఎమోషనల్ పోస్ట్ పెట్టిన మంచు మనోజ్ భార్య.. కారణం అదేనా?

by Mallepaka Hamsa |

టాలీవుడ్ హీరో మంచు మనోజ్(Manchu Manoj) గత కొద్ది కాలంగా వార్తల్లో నిలుస్తున్నాడు.

ఎమోషనల్ పోస్ట్ పెట్టిన మంచు మనోజ్ భార్య.. కారణం అదేనా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో మంచు మనోజ్(Manchu Manoj) గత కొద్ది కాలంగా వార్తల్లో నిలుస్తున్నాడు. సినిమాలకు గ్యాప్ ఇచ్చినప్పటికీ ఆయన తన కుటుంబ గొడవల కారణంగా పలు కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. ఇక చాలా రోజుల తర్వాత మల్టీ స్టారర్ మూవీ ‘భైరవం’ (Bhairavam)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన నటిస్తుండగా.. నారా రోహిత్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 30న థియేటర్స్‌లోకి రానుంది. ఈక్రమంలోనే.. నేడు మనోజ్ పుట్టినరోజు కావడంతో ఆయన భార్య మౌనిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘నేను ప్రేమించే నా సోల్‌మెట్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

మా జీవితాల్లో ఉన్నందుకు ఈ ప్రయాణాన్ని, కుటుంబాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీరు ఈ ప్రపంచాన్ని నివసించడానికి మధురమైన, వెచ్చని ప్రదేశంగా మార్చారు. మీరు చేయబోయే అన్ని పనులు బాగా జరగాలి. మీ ప్రేమ, ఆనందాన్ని పంచడానికి మీ హృదయం వెయ్యేళ్లు బతకాలి. ఈ ఏడాది మాత్రమే కాకుండా అన్ని సంవత్సరాలు మీరు గొప్పగా ఉండాలి. మేము నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాము. మీ జీవితం మరింత ఎదగాలని కోరుకుంటున్నాం. మా ముగ్గురి ప్రేమ మీకోసం మాత్రమే. మీరు నిజంగా మా రాకింగ్ స్టార్. నా ప్రియమైన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా ప్రతి పునర్జన్మలో నా స్నేహితుడు, భర్తగా మీరే రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను’’ అని రాసుకొచ్చింది. అలాగే తన ఫ్యామిలీ ఫొటోను షేర్ చేసింది.

Next Story