- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Manchu Manoj: 'అవ్వ కావాలా.. బువ్వ కావాలా' అంటే ఏం చెప్తాం
రజినీకాంత్ - నాగార్జున కూలీ(Coolie), హృతిక్ రోషన్ - ఎన్టీఆర్ వార్-2(War-2) చిత్రాలు రేపు విడుదల కాబోతున్న వేళ టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్(Manchu Manoj) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రజినీకాంత్ - నాగార్జున కూలీ(Coolie), హృతిక్ రోషన్ - ఎన్టీఆర్ వార్-2(War-2) చిత్రాలు రేపు విడుదల కాబోతున్న వేళ టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్(Manchu Manoj) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ పెట్టారు. ఏ సినిమాకు వెళ్లాలో అంతా కన్‌ఫ్యూజన్‌గా ఉందనే కోణంలో పోస్టు పెట్టారు. ‘అవ్వ కావాలా.. బువ్వ కావాలా’ అని అడగడం లాంటి పరిస్థితిలో ఉన్నానని పేర్కొన్నారు. ఈ రెండు సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని ఈ సందర్భంగా ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఇదిలా ఉంటే.. కూలీ, వార్ -2 సినిమాల విడుదల వేళ రజనీకాంత్‌తో తనకున్న అనుబంధాన్ని సోషల్ మీడియాలో హృతిక్ రోషన్ పంచుకున్నారు. ‘మీ పక్కన నటుడిగా నా తొలి అడుగులు వేశాను. మీరు నా గురువులలో ఒకరు. మీరు నాకు ఎప్పుడూ ఆదర్శం. నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని హృతిక్ పేర్కొన్నారు. కాగా, ఈ రెండు సినిమాలు ఆగష్టు 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కాబోతున్నాయి.






