RRRను ర్యాగింగ్ చేసిన‌ మంచు మ‌నోజ్ !

by velandi.Saikiran |   (  Updated:2025-09-17 02:40:20  IST  )

ర‌ఘురామ కృష్ణంరాజును ర్యాగింగ్ చేశారు టాలీవుడ్ హీరో మంచు మ‌నోజ్‌. స్టేజ్ పైన మాట్లాడుతుండ‌గానే.. ఆట‌ప‌ట్టించారు

RRRను ర్యాగింగ్ చేసిన‌ మంచు మ‌నోజ్ !
X

దిశ‌, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణంరాజును ( Raghu Rama Krishna Raju) ర్యాగింగ్ చేశారు టాలీవుడ్ హీరో మంచు మ‌నోజ్‌. స్టేజ్ పైన మాట్లాడుతుండ‌గానే.. ఆట‌ప‌ట్టించారు. మిరాయ్ హీరోయిన్ ను మెచ్చుకునే త‌రుణంలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. తేజ స‌జ్జా, మంచు మ‌నోజ్ తాజాగా న‌టించిన సినిమా మిరాయ్ అన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావ‌డంతో... క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురుస్తోంది. ఇప్ప‌టికే 100 దాటింద‌ని అంటున్నారు. ఈ త‌రుణంలోనే... తాజాగా మిరాయ్ స‌క్సెస్ మీట్ నిర్వ‌హించారు.

ఈ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మానికి ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణంరాజు హాజ‌రై మాట్లాడారు. ముఖ్యంగా మిరాయ్ హీరోయిన్ రితికాపై చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. హీరోయిన్ రితికా ( Ritika Nayak ) కుంద‌న‌పు బొమ్మ‌లా ఉంద‌ని మెచ్చుకున్నారు. ఏఐ క్రియేట్ చేసిన బొమ్మ‌లాగే హీరోయిన్ ఉంద‌ని ప్ర‌శంసించారు. అయితే.. హీరోయిన్ ను బాగా మెచ్చుకుంటున్న నేప‌థ్యంలోనే... మంచు మ‌నోజ్ ఎంట్రీ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ పై చేయి... వేసి... ఏంటీ క‌థ హీరోయిన్ ను బాగా మెచ్చుకుంటున్నారు? అంటూ క‌ళ్ల‌తో మంచు మ‌నోజ‌న్ ఎక్స్ ప్రేష‌న్స్ ఇచ్చారు. దీంతో న‌న్నే ర్యాగింగ్ చేస్తావా అన్న రేంజ్ లో ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణంరాజు కూడా ఒక్క‌సారిగా న‌వ్వేశారు. ఈ సంఘ‌ట‌న వైర‌ల్ గా మారింది. క్లిక్

Next Story