కట్టుబట్టలతో నన్ను రోడ్డుమీదకు పెట్టారు: మంచు మనోజ్ భావోద్వేగం

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-18 17:33:17  IST  )

మంచు ఫ్యామిలీ(Manchu Family)లో నెలకొన్న కలహాలపై హీరో మనోజ్(Manchu Manoj) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

కట్టుబట్టలతో నన్ను రోడ్డుమీదకు పెట్టారు: మంచు మనోజ్ భావోద్వేగం
X

దిశ, వెబ్‌డెస్క్: మంచు ఫ్యామిలీ(Manchu Family)లో నెలకొన్న కలహాలపై హీరో మనోజ్(Manchu Manoj) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన హీరోగా నటిస్తోన్న భైరవం మూవీ(Bhairavam Movie) ప్రీరిలీజ్ ఫంక్షన్ ఇవాళ జరిగింది. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ.. ‘నా అనుకున్న వాళ్లే నన్ను దూరం పెట్టారు. కట్టుబట్టలతో రోడ్డుమీదకు గెంటేశారు. ప్రేక్షకులే నాకు అండగా నిలబడ్డారు. క్లిష్ట సమయంలో నాకు అండగా ఉన్న అందరికీ పాదాభివందనం. నాకు ఎవరిమీదా కోపం లేదు. చిన్న చిన్న గొడవలు ఎక్కడైనా సహజమే. కానీ కొందరు కావాలని కుట్రపూరితంగా నన్ను మా నాన్నకు దూరం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా డోంట్ కేర్. నేను కట్టెకాలేవరకు మోహన్ బాబు కొడుకునే’ అంటూ మంచు మనోజ్ భావోద్వేగానికి గురయ్యారు. మంచు మనోజ్‌తో పాటు నారా రోహిత్(Nara Rohit), బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) కూడా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా నటిస్తున్నారు. విజయ్‌ కనకమేడల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. మే 30న రిలీజ్ కానున్న ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్‌ని తాజాగా యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచింది.

Next Story