కులపోళ్ల సినిమా అని ట్రోల్ చేస్తున్నారు..భైరవం ఈవెంట్‌లో మనోజ్ సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

న‌లుగురు కుల‌పోళ్లు క‌లిసి సినిమా చేస్తున్నారంటూ త‌మ‌పై సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నార‌ని మంచు మ‌నోజ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. భైర‌వం ప్రీరిలీజ్ ఈవెంట్ లో మ‌నోజ్ మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తమ కులం సినిమా, గుడి థియేటర్ అని అన్నారు. తమ సినిమా ఒక కులానిది కాదు అని గుర్తు పెట్టుకోవాలన్నారు.

కులపోళ్ల సినిమా అని ట్రోల్ చేస్తున్నారు..భైరవం ఈవెంట్‌లో మనోజ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: న‌లుగురు కుల‌పోళ్లు క‌లిసి సినిమా చేస్తున్నారంటూ త‌మ‌పై సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నార‌ని మంచు మ‌నోజ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. భైర‌వం ప్రీరిలీజ్ ఈవెంట్ లో మ‌నోజ్ మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తమ కులం సినిమా, గుడి థియేటర్ అని అన్నారు. తమ సినిమా ఒక కులానిది కాదు అని గుర్తు పెట్టుకోవాలన్నారు.

తమిళ స్టార్ హీరో సూర్యాది ఏ కులం ఇక్కడ ఎందుకు నెత్తినపెట్టుకుంటామని ప్రశ్నించారు. సందీప్ వంగాది ఏ కులం అని బాలీవుడ్ ఆయన్ను నెత్తినపెట్టుకుంటోందని ప్రశ్నించారు. డైరెక్టర్ విజయ్ కనకమేడల పవన్ కల్యాణ్ చిరంజీవిలకు పెద్ద అభిమాని అన్నారు. ఆయన విషయంలో హర్ట్ అయిన మెగా అభిమానులకు మనోజ్ క్షమాపణలు చెప్పారు. విజయ్ మెగా ఫ్యాన్స్‌లో ఒకడు అని వ్యాఖ్యానించారు. మన అనుకున్న వాళ్లే మనమీద తిరగబడటం ఎంత బాధగా ఉంటుందో తనక తెలుసని చెప్పారు. మెగా అభిమానులు అంతా ఇంతటితో ఆపేయాలని కోరారు.

Next Story