- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొట్టి తెచ్చుకునే ‘డేవిడ్ రెడ్డి’ని.. మంచు మనోజ్ కామెంట్స్
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటిస్తున్న కొత్త సినిమా ‘డేవిడ్ రెడ్డి’. వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్ పై వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్న సినిమాకు హనుమ రెడ్డి యక్కంటి దర్శకుడు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్‌తో ఇంటెన్స్ యాక్షన్

దిశ, సినిమా : రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటిస్తున్న కొత్త సినిమా ‘డేవిడ్ రెడ్డి’. వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్ పై వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్న సినిమాకు హనుమ రెడ్డి యక్కంటి దర్శకుడు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్‌తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామాతో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో మారియా ర్యబోషప్క హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో ఈ సినిమా రూపొందుతుండగా.. సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంచు మనోజ్.. ‘మీ అభిమానం ఉన్నంత వరకు నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. మీరు నాకు ఇన్నేళ్లుగా ఇస్తున్న ప్రేమ, అభిమానానికి పాదాభివందనం. నేను ఎలాంటి సినిమాతో మళ్లీ హీరోగా రావాలా అని అనుకుంటున్న టైమ్‌లో నా మిత్రుడు రామ్ ఫోన్ చేసి మంచి కథ ఉంది వినమని అన్నాడు. అదే ‘డేవిడ్ రెడ్డి’. 1897 నుంచి 1922 మధ్య కాలంలో జరిగే పీరియాడిక్ యాక్షన్ మూవీ ఇది. ఈ సినిమాను ప్రొడక్షన్ క్వాలిటీ పరంగా ఎక్కడా రాజీ పడకుండా కోట్ల రూపాయల ఇన్వెస్ట్‌మెంట్‌తో వెంకట్ రెడ్డి, భరత్ ప్రొడ్యూస్ చేశారు. డేవిడ్ రెడ్డి బ్రిటీష్ వారికే కాదు ఇండియన్స్‌కు కూడా శత్రువే. డేవిడ్ రెడ్డికి పీస్ ఫుల్‌గా ఉండటం రాదు. ఏదైనా వెళ్లి కొట్టి తెచ్చుకోవడమే తెలుసు. ఇలాంటి ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ నేను చేయగలను అని నమ్మి నాతో మూవీ చేస్తున్న డైరెక్టర్ హనుమకు థ్యాంక్స్’ అని తెలిపారు. ఈ కార్యక్రమానికి స్టంట్ కొరియోగ్రాఫర్ సుప్రీమ్ సుందర్, ప్రొడ్యూసర్ వెంకట్ రెడ్డి, ప్రొడ్యూసర్ భరత్ మోటుకూరి, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్, డైరెక్టర్ హనుమరెడ్డి యక్కంటి తదితరులు పాల్గొన్నారు.






