మాస్ లుక్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న మంచు లక్ష్మి

by Pulgam srinivas |

మాస్ లుక్‌లో సెగలు రేపుతున్న మంచు లక్ష్మి.. వైరల్ అవుతున్న ఫోటోలు

మాస్ లుక్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న మంచు లక్ష్మి
X

దిశ, వెబ్ డెస్క్: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆంగ్ల చిత్రాల ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించిన ఈమె, ‘అనగనగా ఒక ధీరుడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.




ఈ చిత్రంలో ప్రతినాయక పాత్రలో నటించిన మంచు లక్ష్మి, తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈ నటి పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించింది. అలాగే కొన్ని టీవీ, ఓటీటీ షోలకు హోస్ట్‌గా కూడా వ్యవహరించింది.




సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ మరియు ఓటీటీ షోలతో తన కెరీర్‌ను పర్వాలేదనిపించే విధంగా కొనసాగిస్తున్న మంచు లక్ష్మి, సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటూ వస్తోంది.




ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా కూడా ఈమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని స్టైలిష్ లుక్‌లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోల్లో మంచు లక్ష్మి గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ కలిగిన బ్లాక్ కలర్ అల్ట్రా స్టైలిష్ డ్రెస్ ధరించి తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు పోజులు ఇచ్చింది.




ఇక ఈ ఫోటోల్లో ఈమె ఇయర్ రింగ్స్ ధరించి ఆకట్టుకునే లుక్‌లో కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోల్లో మంచు లక్ష్మి స్టైలిష్ మరియు హాట్ లుక్‌లో కనిపించడంతో, అవి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story