‘ఇంటర్వ్యూ అని పిలిచి నన్ను బాడీ షేమింగ్ చేశారు’.. ఫిల్మ్ ఛాంబర్‌లో మంచు లక్ష్మి కంప్లైంట్

by Gantepaka Srikanth |

గ్రేట్ ఆంధ్రా వెబ్‌సైట్‌(Great Andhra Website) నిర్వహకులపై ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి(Manchu Lakshmi) కంప్లైంట్ చేశారు.

‘ఇంటర్వ్యూ అని పిలిచి నన్ను బాడీ షేమింగ్ చేశారు’.. ఫిల్మ్ ఛాంబర్‌లో మంచు లక్ష్మి కంప్లైంట్
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేట్ ఆంధ్రా వెబ్‌సైట్‌(Great Andhra Website) నిర్వహకులపై ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి(Manchu Lakshmi) కంప్లైంట్ చేశారు. మూవీ ఇంటర్వ్యూ పేరుతో బాడీ షేమింగ్ చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వయసుతో పాటు తన వేశధారణను కూడా అవమానించారంటూ ఆమె కంప్లైంట్ ఇచ్చారు. ఆ వెబ్‌సైట్‌లో ఫిల్మ్ ఛాంబర్‌(Film Chamber)లో ఈ మేరకు మంచు లక్ష్మి ఫిర్యాదు చేశారు. అలాగే మహిళా కమిషన్‌లో కంప్లైంట్ చేస్తానని తెలిపారు. కాగా, తన తండ్రి మోహన్‌బాబు (Mohan Babu)తో కలిసి ఆమె నటించిన యాక్షన్‌ చిత్రం ‘దక్ష’ (Daksha). సెప్టెంబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల చిత్ర ప్రచారంలో భాగంగా ఆమె ఇంటర్వ్యూలో ఇచ్చారు.

Next Story