ManaShankaraVaraPrasadGaru: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మన శంకర వరప్రసాద్ గారు షూటింగ్ అప్డేట్ వచ్చేసింది

by Chukka Sudharani |

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’.

ManaShankaraVaraPrasadGaru: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మన శంకర వరప్రసాద్ గారు షూటింగ్ అప్డేట్ వచ్చేసింది
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’. ‘పండక్కి వస్తున్నారు’ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నయనతారా హీరోయిన్‌గా నటిస్తుండగా.. విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రజెంట్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ మూవీపై అనౌన్స్‌మెంట్ నుంచే ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీంతో మూవీ నుంచి వచ్చే అప్డేట్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఇందులో భాగంగానే తాజాగా షూటింగ్ అప్డేట్ వచ్చింది.

ఈ మేరకు.. మెగాస్టార్ చిరంజీవి, నయనతారలపై ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒక అందమైన నైట్ ఎఫెక్ట్ మెలోడీ చిత్రీకరణ జరుగుతోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ పోలాకి మాస్టర్ అండ్ చిరంజీవి మధ్య ఇది మొదటి కలయిక కాగా.. ఈ సాంగ్‌పై అంచనాలు ఉన్నాయి. అంతే కాకుండా.. ఈ షెడ్యూల్‌లో మరో పాట అండ్ ఈ రెండు పాటలకు ప్రధాన సన్నివేశాలు ఉంటాయట. అలాగే అక్టోబర్‌లో ఒక ప్రధాన షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇది 99% షూటింగ్‌ను పూర్తి చేస్తుంది. విక్టరీ వెంకటేష్ ఈ చిత్రీకరణలో పాల్గొంటారు. కాగా.. MSG 2026 సంక్రాంతికి విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. లింక్

Next Story