Mana Shankara Vara Prasad Garu: చిరంజీవి సినిమాకు భారీ క‌లెక్ష‌న్స్‌..రూ.200 కోట్లు క్రాస్‌

by velandi.Saikiran |   (  Updated:2026-01-16 11:49:42  IST  )

మన శంకర వరప్రసాద్ గారు సినిమా 200 కోట్ల క్లబ్ లో చేరిపోయింది.

Mana Shankara Vara Prasad Garu: చిరంజీవి సినిమాకు భారీ క‌లెక్ష‌న్స్‌..రూ.200 కోట్లు క్రాస్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు ( Mana Shankara Vara Prasad Garu ). మన సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమాకు భారీగా కలెక్షన్స్ వచ్చాయి. రోజు రోజుకు ఈ సినిమా కలెక్షన్స్ పెరిగిపోతూనే ఉన్నాయి. గడిచిన నాలుగు రోజుల్లోనే మన శంకర వరప్రసాద్ గారు సినిమా 200 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా చిత్ర బృందం అధికారికంగా వదిలింది. థియేటర్ లోపల ఈలలు.. బయట హౌసింగ్ బోర్డులు.. 200 కోట్ల కలెక్షన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు శతకోటి వందనాలు అంటూ చిత్ర బృందం రాసుకోవచ్చు.

కామెడీతో అదరగొట్టిన మెగాస్టార్ చిరంజీవి

సంక్రాంతి కానుకగా వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవి హీరోగా చేయగా నయనతార హీరోయిన్ గా మెరిసింది. ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ చేశాడు. దాదాపు 20 నిమిషాల పాటు ఓ కన్నడ వాడిగా ఎంట్రీ ఇస్తాడు వెంకటేష్. విక్టరీ వెంకటేష్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమా ఓ రేంజ్ కు వెళ్తుంది. కాగా ఈ సినిమాలో కేతిక శర్మ కీలక పాత్ర చేసిన సంగతి తెలిసిందే.

Next Story