‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ ఎఫెక్ట్.. థియేటర్ వద్ద కన్నీళ్లు పెట్టుకున్న చిరంజీవి అభిమాని

by Jakkula.Mamatha |

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Varaprasad Garu)

‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ ఎఫెక్ట్.. థియేటర్ వద్ద కన్నీళ్లు పెట్టుకున్న చిరంజీవి అభిమాని
X

దిశ,వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Varaprasad Garu). ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ(జనవరి 12) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది. థియేటర్ల వద్ద చిరంజీవి అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. వింటేజ్ మెగాస్టార్ లుక్‌తో పాటు కామెడీ టైమింగ్ అదిరిపోయిందంటూ మెగా ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చేసిందని మెగాస్టార్ ఖాతాలో మరో హిట్ పడిందని అంటున్నారు. ఈ క్రమంలో ఓ అభిమాని ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా చూసి కంటతడి పెట్టుకున్నాడు. ‘‘అన్నయ్యను చాలాకాలం తర్వాత ఇలా మళ్లీ చూశాను. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ’’ ఏడ్చేశాడు. ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది.

Next Story