- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమా...వెంకీ రెమ్యూనరేషన్ ఎంతంటే ?
మన శంకర వరప్రసాద్ గారు కోసం వెంకటేష్ దాదాపు 20 నుంచి 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట.

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ గా నటించిన సినిమా మన శంకర వరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో చిరంజీవి హీరోగా చేస్తుండగా నయనతార హీరోయిన్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా రిలీజ్ కు మరో పది రోజుల సమయం మాత్రమే ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. అయితే సంక్రాంతికి వస్తున్న ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు.
దాదాపు 30 నిమిషాల పాటు విక్టరీ వెంకటేష్ పాత్ర ఈ మూవీలో ఉండనుందట. ఇలాంటి నేపథ్యంలో తాజాగా విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి కలిసి చేసిన ఓ పాటను కూడా రిలీజ్ చేశారు అనిల్. అయితే ఈ మూవీలో నటించినందుకు గాను విక్టరీ వెంకటేష్ దాదాపు 20 నుంచి 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. అటు మెగాస్టార్ చిరంజీవి ఏకంగా 70 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ఈ మేరకు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి.






