‘మన శంకర వర ప్రసాద్ గారు’ నుంచి ‘శశిరేఖ’ సాంగ్

by Sujitha Rachapalli |

మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం సంక్రాంతి బరిలో నిలవబోతుంది. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ , గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై

‘మన శంకర వర ప్రసాద్ గారు’ నుంచి ‘శశిరేఖ’ సాంగ్
X

దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం సంక్రాంతి బరిలో నిలవబోతుంది. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ , గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై శ్రీమతి అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంగీత ప్రయాణం ఫస్ట్ సింగిల్ ‘మీసాల పిల్ల’తో అద్భుతంగా ప్రారంభమైంది. 75 మిలియన్ల+ వ్యూస్‌ను సాధించింది. ఇదే సక్సెస్ కొనసాగిస్తూ.. సెకండ్ సింగల్ ‘శశిరేఖ’ను విడుదల చేయబోతుంది మూవీ టీమ్. ఇందుకు సంబంధించిన పోస్టర్‌లో చిరు, నయన్ స్టైలిష్ డ్యాన్స్ పోజ్ ఆకట్టుకుంటుడగా.. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చిన ఈ పాట ప్రోమో డిసెంబర్ 6న, లిరికల్ వీడియో డిసెంబర్ 8న విడుదల కానుంది.

Next Story