- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నయనతార రెమ్యూనరేషన్ పై కాంట్రవర్సీ..అడిగినంత ఇవ్వలేదా ?
మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో హీరోగా నటించిన మెగాస్టార్ చిరంజీవి రూ.70 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట.

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా సినిమా మన శంకర వరప్రసాద్ గారు ( Mana Shankara Vara Prasad ). సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తున్న సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం రిలీజ్ అయిన ఈ సినిమాకు కుటుంబ సమేతంగా జనాలు వెళ్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లన్నీ హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమాలో నటించిన వాళ్ల రెమ్యూనరేషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మన శంకర వరప్రసాద్ గారు రెమ్యూనరేషన్ వివరాలు
మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో హీరోగా నటించిన మెగాస్టార్ చిరంజీవి రూ.70 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. అలాగే ఈ మూవీ కోసం మొదట రూ.18 కోట్లు నయనతార డిమాండ్ చేశారట. కానీ ఆ తర్వాత ఆరు కోట్లకే పరిమితమైనట్లు టాక్ నడుస్తోంది. ఇంకా విక్టరీ వెంకటేష్ 20 నిమిషాల పాత్రకు ఏకంగా తొమ్మిది కోట్లు తీసుకుంటున్నాడని అంటున్నారు. అటు అనిల్ రావిపూడి రూ.25 కోట్లు వసూలు చేయబోతున్నట్లు సమాచారం.






