- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
100 కోట్ల వ్యూస్ తో.. సరికొత్త వైబ్ లో మన శంకరవరప్రసాద్ గారు
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, నయనతార కాంబినేషన్లో తెరకెక్కుతున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా ..

దిశ, వెబ్‌డెస్క్: అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, నయనతార కాంబినేషన్లో తెరకెక్కుతున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి ఇప్పటికే రెండుపాటలు విడుదలయ్యాయి. తొలిగా రిలీజైన మీసాల పిల్ల సాంగ్ కు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సాంగ్ ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్ గా మారింది. మీసాలపిల్ల పాటకు ఇప్పటి వరకూ 80 మిలియన్ల వ్యూస్ రాగా.. రీసెంట్ గా వచ్చిన శశిరేఖ సాంగ్ కు 20 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో రెండు పాటలకు 100 మిలియన్ల వ్యూస్ తో మన శంకర వరప్రసాద్ గారు కొత్త వైబ్ తో దుమ్ము లేపుతోంది.
సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ హిట్ సాంగ్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. నయనతార హీరోయిన్ గా నటిస్తోన్న సినిమాలో విక్టరీ వెంకటేశ్ కూడా స్పెషల్ క్యారెక్టర్లో నటిస్తుండటంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది.






