“మన శంకర వరప్రసాద్ గారు” నుంచి అదిరిపోయే అప్డేట్

by velandi.Saikiran |

చిరంజీవి - విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో మాస్ సాంగ్ ఉంటుందట. ఇప్పటికే ఈ పాటకు

“మన శంకర వరప్రసాద్ గారు” నుంచి అదిరిపోయే అప్డేట్
X

దిశ‌, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తుండగా, హీరోయిన్ గా నయనతార నటిస్తున్నారు. ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది.

ఈ మూవీలో చిరంజీవి - విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో మాస్ సాంగ్ ఉంటుందట. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. అయితే ఈ పాటను డిసెంబర్ 30వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే అప్డేట్ వచ్చేసింది. అయితే తాజాగా మరో కీలక అప్డేట్ వదిలింది. ఈ ఊర మాస్ సాంగ్ ను గుంటూరులోని విజ్ఞాన్ యూనివర్సిటీలో రిలీజ్ చేయనున్నట్లు తాజాగా వెల్లడించింది చిత్ర బృందం. ఈ కార్యక్రమం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపింది. ఈ ఈవెంట్ కు సినిమాలో నటించిన వాళ్లందరూ హాజరు అవుతారట.

Next Story