Mamita Baiju: మరోసారి లవ్ స్టోరీతో వచ్చేస్తున్న మమిత బైజు.. ఆకట్టుకుంటోన్న సెకండ్ పోస్టర్

by sudharani |
Mamita Baiju: మరోసారి లవ్ స్టోరీతో వచ్చేస్తున్న మమిత బైజు.. ఆకట్టుకుంటోన్న సెకండ్ పోస్టర్
X

దిశ, సినిమా: ‘ప్రేమలు’ ఫేమ్ బ్యూటీ మమిత బైజు (Mamita Baiju) ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా మమిత తమిళ (Tamil) హీరో విష్ణు విశాల్‌(Vishnu Vishal)తో జతకట్టింది. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ చిత్రానికి ‘ఇరందు వానం’ (IRANDU VAANAM) అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ వైరల్‌గా కాడా.. సోషల్ మీడియా(Social media)లో మంచి రెస్పాన్స్ (Response) దక్కించుకుంది.

ఇందులో భాగంగా ఇప్పుడు సెకండ్ పోస్టర్‌(Second poster)ను విడుదల చేశారు. ఇందులో మమిత విష్ణు విశాల్‌ను ప్రేమగా చూస్తుండగా.. విష్ణు మమితను వెనుక నుంచి పట్టుకుంటాడు. ప్రజెంట్ ఈ పోస్టర్ నెట్టింట క్యూట్‌గా వైరల్ అవుతోంది. కాగా.. ఈ చిత్రానికి రామ్ కుమార్ (Ram Kumar) దర్శకత్వం వహిస్తుండగా.. సత్య జ్యోతి ఫిల్మ్స్‌పై టీజీ త్యాగరాయన్ భారీ బడ్జేట్‌తో నిర్మిస్తున్నారు. ఇక రెండు సూపర్ హిట్ సినిమాలైన ‘ముండసుపట్టి’, ‘రాట్‌ససన్’ తర్వాత రామ్‌కుమార్, విష్ణు విశాల్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ప్యూర్ లవ్ స్టోరీ (love story) బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story